ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు
గరిడేపల్లి,(విజయక్రాంతి): గరిడేపల్లి నూతన ఎస్ఐగా శ్రీకాంత్ గౌడ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించడం జరిగింది.శుక్రవారం ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్ ను తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు,మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుగులోతు నీలా హేమ్లా నాయక్ పలువురు గిరిజన నాయకులతో కలిసి గిరిజన సాంప్రదాయ పద్ధతిలో తలపాక శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా నీల హేమ్లా నాయక్ మాట్లాడుతూ... ప్రజలకు మంచి సేవలను అందించాలని ఎస్సైని కోరారు. కార్యక్రమంలో ఎల్ హెచ్ పి ఎస్ జాతీయ కమిటీ అధికార ప్రతినిధి బానోతు వెంకట్రావు నాయక్ మండల అధ్యక్షులు గుగులోతు సందీప్ నాయక్ రాంబాబు నాయక్ నాగు నాయక్ బాలు నాయక్ ఫుల్యా నాయక్ రవీందర్ విద్యా కమిటీ చైర్మన్ కోటయ్య మాజీ నీటి సంఘం డైరెక్టర్ వెంకట్రావు నాయక్ మాజీ వార్డ్ మెంబర్ శ్రీను నాయక్ రవీందర్ నాయక్ పాల్గొన్నారు






