జాన్కంపేట పీటీసీలో ఫైరింగ్ ట్రైనింగ్.. జాగ్రత్త
22-05-2026 08:44 PM
బోధన్,(విజయక్రాంతి): ఎడపల్లి మండలం జాన్కంపేట్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో రేపటి నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకు 10 రోజుల పాటు ఫైరింగ్ శిక్షణ నిర్వహిస్తున్నట్లు ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపారు. పీటీసీ పరిసర ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ శిక్షణ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో గ్రామస్థులు, పశువుల కాపర్లు, రైతులు పిటీసీ వైపు వెళ్లవద్దని ఆమె హెచ్చరించారు.






