ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలి
22-05-2026 08:46 PM
కోదాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరధ
కోదాడ,(విజయక్రాంతి): తీవ్రమైన ఎండల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వేసవి జాగ్రత్తలు తీసుకోవాలని కోదాడ ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ దశరధ కోరారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఉష్ణోగ్రతలు తీవ్రస్థాయికి చేరినందున చిన్నారులు, వృద్ధుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలన్నారు. ఎక్కువగా నీరు తాగడం, సరైన పోషకాహారం తీసుకోవాలన్నారు. మధ్యాహ్నం సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లవద్దన్నారు. అత్యవసరం అయితే బయటకు వెళ్లేటప్పుడు పైన టోపీ లేదా తెలుపు రంగు టవల్ తల నిండా చుట్టుకోవాలని, చలువ కళ్లద్దాలు, తెలుపు రంగు కాటన్ దుస్తులు ధరించాలన్నారు. ఆరోగ్యంలో తేడా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సూచించారు.






