కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ
22-05-2026 07:28 PM
బోధన్,(విజయక్రాంతి): కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానాలను రద్దు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్మికుల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జంగం గంగాధర్, పత్రి ఎల్లయ్య, బషీర్ పాల్గొన్నారు.






