పోలీసుల కార్డన్ సెర్చ్..
భైంసా ,ఆగస్టు 17 ( విజయక్రాంతి):జిల్లాలో శాంతి భద్రతల పర్యవేక్షణకు పోలీస్ శాఖ నిరంతరంగా నిర్బంధ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఏ ఎస్ పి సాయికిరణ్ తెలిపారు. సోమవారం భైంసా మండలంలోని ఇలేగాం గ్రామంలో పోలీసులు సోమవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 70 ద్విచక్ర వాహనాలు, నాలుగు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు.
గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్డన్ సెర్చ్ లో భైంసా రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, రూరల్ ఎస్త్స్ర ప్రియాంక, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.






