182 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన పోచారం
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని 9 మండలంలోని 182 మంది లబ్ధిదారులకు శుక్రవారం ముఖ్యమంత్రి సహాయ నిది (CMRF) రూ 54,34,000/- ల చెక్కులను ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. బాన్సువాడ మండలం 33 మంది CMRF లబ్ధిదారులకు రూ 8,86,500/- బాన్సువాడ మున్సిపాలిటీ 12 మంది CMRF లబ్ధిదారులకు రూ 4,35,000/-బీర్కూర్ మండలం 17 CMRF లబ్ధిదారులకు రూ 4,57,000/- నసురుల్లబాద్ మండలం 11 మంది లబ్దిదారులకు రూ 3,05,000/-మొస్రా మండలం 11 మంది లబ్దిదారులకు రూ 2,66,000/- చందూర్ మండలం 18 మంది లబ్దిదారులకు రూ 4,93,500/-వర్ని మండలం 23 మంది లబ్దిదారులకు రూ 6,56,500/-రుద్రుర్ మండలం 13 మంది లబ్దిదారులకు రూ 4,32,000/-కోటగిరి మండలం 22 మంది లబ్దిదారులకు రూ 5,97,000/-పోతంగల్ మండలం 18 మంది లబ్ధిదారులకు రూ 7,93,000/- ఇతరులు నలుగురు లబ్ధిదారులకు రూ 1,12,500,మొత్తం నియోజక వర్గం లో 182 మంది CMRF లబ్ధిదారులకు రూ. 54,34,000/-పంపిణీ చేసినట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సర్పంచులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.




