26 August, 2026 | 12:18 AM

మండలంలో పోచమ్మ బోనాల ఉత్సవాలు.

25-08-2026 11:31 PM

రాజాపూర్: మండల కేంద్రంతో పాటు మండలంలోని ముదిరెడ్డిపల్లి నందిగామ రాయపల్లి మల్లేపల్లి రంగారెడ్డి గూడా ఖానాపూర్ చెన్నా వెళ్లి కొచ్చారకల్ ఇబ్రహీం పల్లి తదితర గ్రామాలలో మంగళవారం పోచమ్మ బోనాల వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఆయా గ్రామాలలో పోచమ్మ దేవాలయాలను సుందరంగా అలంకరించారు. గ్రామ పుర వీధులను వేప తోరణాలతో అలంకరించారు.

మహిళలు అమ్మవారికి మట్టి కుండలో బోనం తయారుచేసి డబ్బు చప్పుళ్ళు పోతురాజుల ఆటలతో బోనాలను ఊరేగింపు నిర్వహించారు. అమ్మవారికి బోనాలతో ప్రదక్షణ చేసి బోనాన్ని సమర్పించి, కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా పల్లెల్లో ఎక్కడ చూసినా డీజే పాటలతో డబ్బు, డోలు చప్పుళ్లతో మార్మోగాయి. బోనాల వేడుకలలో ఆయా గ్రామాల సర్పంచులు ఉప సర్పంచులు వార్డు సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు యువకులు పాల్గొన్నారు.