16 April, 2026 | 11:18 PM

Breaking News

సదాశివపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలపై జగ్గారెడ్డి, నిర్మల సమీక్ష   •   గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •  

మహిళా రిజర్వేషన్ బిల్లు— ప్రతిపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక

16-04-2026 04:04 PM
  1. దేశ చరిత్రలో ఇది ఒక కీలక ఘట్టం
  2. చరిత్ర సృష్టించడానికి పార్లమెంట్‌కు ఇది ఒక సువర్ణ అవకాశం
  3. మహిళల స్వావలంబన ఉంటేనే.. అది సంపూర్ణ వికసిత్ భారత్
  4. మహిళా రిజర్వేషన్ బిల్లు దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు 

న్యూఢిల్లీ: దేశ పార్లమెంటరీ చరిత్రలో ఈ రోజును మరిచిపోలేమని ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) అన్నారు.  మహిళా రిజర్వేషన్ బిల్లు(women's quota bill) దేశ చరిత్రలోనే గొప్ప బిల్లు అన్నారు. 30 ఏళ్ల పాటు ప్రయత్నాలు జరిగినా గతంలో ఇది సాకారం లేదని వివరించారు.  దేశ రాజకీయాల్లో మహిళల పాత్ర కీలకం, మహిళలను కలుపుకుని ముందుకెళుతున్నామని పేర్కొన్నారు. మహిళలకు అవకాశం ఇస్తే దేశానికి సరికొత్త మార్గం చూపిస్తారని ప్రధాని తెలిపారు. దేశానికి సరికొత్త దశ, దిశను ఇస్తున్నామని చెప్పారు. వికసిత్ భారత్ అంటే రోడ్లు, రైళ్లు, మౌళిక సదుపాయాలు మాత్ర కాదన్న పీఎం మోదీ మహిళల స్వావలంబన కూడా ఉంటేనే.. అది సంపూర్ణ వికసిత్ భారత్ అన్నారు. వికసిత్ భారత్ సాధనలో మహిళల పాత్ర కీలకం అన్నారు. మహిళా బిల్లును వ్యతిరేకించే వారిని మహిళలు క్షమించరని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును వ్యతిరేకించే పార్టీలకు, నేతలకు మహిళలు బుద్ధి చెబుతారని సూచించారు. మహిళల బిల్లు విషయంలో అందరూ  కలిసి రావాలని ప్రధాని పిలుపునిచ్చారు.

ఈ చారిత్రక సమయంలో పాలుపంచుకోవడం అదృష్టమని ప్రధాని పేర్కొన్నారు.  ఈ బిల్లును తేవటంలో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని వివరించారు. ఇది రాజకీయ పార్టీల కోసం తెచ్చింది కాదు.. దేశ ప్రజల కోసం తెచ్చిన బిల్లు అన్నారు. 30 ఏళ్ల క్రితమే మహిళా బిల్లు తెచ్చామంటున్నారు.. మరి ఎవరికైనా మేలు జరిగిందా? అని ప్రధాని ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లును దేశప్రజలంతా స్వాగతిస్తున్నా తెలిపారు. తమకు అన్యాయం చేసిన వారిని మహిళలు సమయం చూసి దెబ్బకొడతారని చెప్పారు. మహిళా బిల్లుకు పార్టీలన్నీ ఏకగ్రీవంగా మద్దతివ్వాలని ప్రధాని కోరారు. మహిళలు తమ హక్కులపై 30 ఏళ్లుగా గొంతు విప్పుతున్నారు. క్షేత్రస్థాయిలో మహిళలు 30 ఏళ్లుగా పోరాడుతున్నారు. రాజకీయాల్లో శక్తి సామర్థ్యాలు చూపించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ప్రధాని వెల్లడించారు. ఎవరికైనా అవకాశం ఇస్తేనే కదా.. వారి సామర్థ్యం తెలుస్తోందన్నారు. మహిళా బిల్లుకు మద్దతిచ్చే పార్టీలకే మనుగడ ఉంటుందని మోదీ హెచ్చరించారు.

గ్రామీణస్థాయిలో రిజర్వేషన్ల వల్ల మహిళలకు రాజకీయ అవగాహన వచ్చిందన్నారు. గ్రామీణస్థాయిలో మహిళలు ఇప్పటికే నాయకులుగా రాణిస్తున్నారని, ఒక్కసారి 33 శాతం రిజర్వేషన్లు ఇచ్చి చూస్తే... మహిళా శక్తి ఏంటో చూస్తారని తెలిపారు. మహిళా బిల్లు నిర్ణయం ఒక్క రాత్రిలో జరిగింది కాదు.. ఈ బిల్లును అందరం మనస్ఫూర్తిగా స్వాగతించాలన్నారు. 2023లో అందరి ఏకగ్రీవంగా నారీశక్తి బిల్లును ఆమోదించుకున్నామని గుర్తుచేశారు.  కోవిడ్ వల్ల 2021లో జనగణన చేపట్టలేకపోయామని వివరించారు. ఈ బిల్లు తీసుకురాగానే కొందరు విభజన రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉత్తర, దక్షిణాది అంటూ విభజన తీసుకువస్తున్నారని ప్రధాని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలు చేసే వారిని ప్రజలు ఇప్పటికే దూరం పెట్టారని సూచించారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని ప్రధాని హామీ ఇచ్చారు.

చిన్న రాష్ట్రం, పెద్ద రాష్ట్రం.. అనే భేదాలు తమకు లేవని పేర్కొన్నారు. ఏ ప్రాంతానికీ అన్యాయం జరగదని హామీ ఇస్తన్నామని ప్రధాని పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి నష్టం జరగదని నరేంద్ర మోదీ వాగ్దానం చేశారు. దేశంలోని మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నాం, అనేక పార్టీలు మహిళల హక్కులను ఇన్నాళ్లూ అడ్డుకున్నారని ఆరోపించారు. దాన్ని గుర్తించి తాము ఇప్పుడు మహిళలకు వారి హక్కులు కల్పిస్తున్నామని తెలిపారు. అనేక కారణాలు చూపించి గతంలో మహిళా బిల్లును అడ్డుకున్నారని విమర్శించారు. సాంకేతిక కారణాలు చూపించి 30 ఏళ్ల పాటు మహిళ బిల్లును అడ్డుకున్నారు. మహిళా బిల్లు క్రెడిట్ అందరికీ దక్కుతుందన్నారు. "మహిళా బిల్లుపై నాకు క్రెడిట్ ఏమీ వద్దు.. క్రెడిట్ మీరు తీసుకోండి" అన్నారు.  మహిళా బిల్లుపై అన్ని పార్టీల నేతల ఫొటోలూ వేసుకోండని స్పష్టం చేశారు. ఇప్పుడు అడ్డుకోకుండా సహకరించి మీ గొప్పతనం చాటుకోండని పిలుపునిచ్చారు. దేశానికి హాని చేసే, నష్టం కలిగించే అంశాలను సభ్యులంతా ఖండించాలని కోరారు.