calender_icon.png 20 February, 2026 | 3:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

షిల్లాంగ్ ఎంపీ మృతికి ప్రధాని మోదీ సంతాపం

20-02-2026 11:37:18 AM

న్యూఢిల్లీ: షిల్లాంగ్ లోక్‌సభ ఎంపీ రికీ ఎజె సింగ్‌కాన్(Shillong MP Ricky Syngkon) మృతికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi condoles) శుక్రవారం సంతాపం తెలిపారు. మేఘాలయ ప్రజలకు ఆయన చేసిన అంకితభావ సేవలను పీఎం మోదీ స్మరించుకున్నారు. మేఘాలయ వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీకి చెందిన 54 ఏళ్ల ఎంపీ గురువారం షిల్లాంగ్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ కుప్పకూలి మరణించారు. "షిల్లాంగ్ లోక్‌సభ ఎంపీ డాక్టర్ రికీ ఎజె సింగ్‌కాన్ మరణం బాధాకరం. మేఘాలయ ప్రజలకు ఆయన చేసిన అంకితభావ సేవకు ఆయన చిరకాలం గుర్తుండిపోతారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి" అని మోడీ ఎక్స్ లో పేర్కొన్నారు.