calender_icon.png 20 February, 2026 | 1:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైత్రీవనంలో భారీ అగ్నిప్రమాదం

20-02-2026 11:54:40 AM

హైదరాబాద్: నిత్యం రద్దీగా ఉండే అమీర్ పేట మైత్రీవనం(Maitreevanam) చౌరస్తాలోని ఆదిత్య ఎన్ క్లేవ్ బిల్లడింగ్ లో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. ఆదిత్య ఎన్ క్లేవ్ బిల్డింగ్ లోని కోచింగ్ సెంటర్ లో విద్యార్థులు చిక్కుకున్నారు. విద్యార్థులను యువకులు, పోలీసులు బయటకు తరలిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లోని ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.