19 June, 2026 | 3:10 AM

రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి రండి

19-06-2026 02:06 AM
  1. బీజేపీ జాతీయాధ్యక్షుడు నితిన్ నబీన్‌కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆహ్వానం
  2. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చ

హైదరాబాద్, జూన్ 18 (విజయక్రాంతి): ఈ నెల చివరి వారంలో నిర్వ హించనున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరుకావాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌ను రాష్ట్ర అధ్యక్షుడు రాం చందర్‌రావు కోరారు. గురువారం న్యూఢిల్లీలో నితిన్ నబీన్‌తో సమావేశమైన రాం చందర్‌రావు రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిణామా లు, పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశ ఎజెండా, తదితర అంశాలపై నివేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడికి అందజేశారు.