24 July, 2026 | 9:46 PM

దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలు

24-07-2026 08:59 PM

బేల,(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా బేల మండల భీమ్ ఆర్మీ – ఆజాద్ సమాజ్ పార్టీ కమిటీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి నీట్ (NEET) పరీక్ష పేపర్ లీక్ ఘటనపై మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న నీట్ పరీక్షలో జరిగిన పేపర్ లీక్ ఘటన అత్యంత తీవ్రమైనదన్నారు. ఈ ఘటనపై సమగ్ర, నిష్పాక్షిక విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అలాగే ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తహసిల్దార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జీ MD ఫెరోస్ ఖాన్, బేల మండలం ప్రెసిడెంట్ షేక్ సోజర్, కార్యకర్తలు సిద్ధార్థ్, ఆశిష్, MD షైబాజ్, sk సమీర్ sk మోసీన్, అమూల్, దినేష్, సంఘర్ష, తదితరులు పాల్గొన్నారు.