17 August, 2026 | 3:04 AM

ఎత్తొండలో ప్లాస్టిక్ నిషేధం

17-08-2026 12:10 AM

బోధన్, ఆగస్టు 16 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎ త్తొండలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించేందుకు గ్రామ పంచాయతీ కీలక నిర్ణయం తీసుకుంది. పంద్రాగస్టు సందర్భంగా గ్రామంలో ప్లాస్టిక్ గ్లాసులు, ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై నిషేధం విధిస్తున్నట్లు సర్పంచ్ శ్వేత ప్రకటించారు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి కలిగే నష్టాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపారు.

గ్రామంలోని హోటళ్లలో టీ, టిఫిన్ తదితరాల కోసం ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లను ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించాలని నిర్వాహకులకు సూచించారు. ప్లాస్టిక్ గ్లాసులకు బదులుగా హోటళ్లలో వినియోగించేం  దుకు సర్పంచ్ శ్వేత తన సొంత ఖర్చులతో స్టీల్ గ్లాసులను ఏర్పాటు చేయడం పట్ల గ్రా మస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్టిక్ రహిత గ్రామంగా ఎత్తోండను తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సర్పంచ్ కోరారు. ప్లాస్టిక్ వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా పారిశుధ్య సిబ్బందికి సహకరించాలని కోరారు.