3 May, 2026 | 3:19 PM

ప్రతి ఏటా అడవుల్లో రాజుకుంటున్న నిప్పు

03-05-2026 02:14 PM

అర్బన్ పార్కుకు తప్పని ముప్పు

శనివారం రాత్రి అర్బన్ పార్కులో కాలిపోతున్న మొక్కలు

బోథ్,(విజయక్రాంతి): ప్రతి సంవత్సరం వర్షాకాలంలో రోడ్లకు ఇరువైపులా అడవుల్లో మొక్కలను నాటుతున్నారు.అయితే ప్రతి ఏటా వేసవికాలంలో అడవులలో అగ్ని ప్రమాదాలు సంభవించడం నాటిన మొక్కలు అగ్నికి  బూడిదవుతున్నాయి. అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ ఆధ్వర్యంలో ముందస్తు చర్యలు చేపడుతున్న ఫలితాలను ఇవ్వడం లేదు. 44వ నెంబర్ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అర్బన్ పార్క్ లో శనివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో వేలాది మొక్కలు కాలిపోయాయి. అటవీ శాఖ అధికారుల లెక్కల ప్రకారం 60 వేల మొక్కలు అర్బన్ పార్క్ లో ఉన్నట్లు తెలిసింది. మరోవైపు రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు సైతం అగ్ని ప్రమాదాల్లో కాలిపోతున్నాయి