2 June, 2026 | 5:33 PM

Breaking News

వాతావరణ పరిరక్షణకు చెట్లను నాటండి

02-06-2026 04:00 PM

బోథ్,(విజయక్రాంతి): వాతావరణం సమతుల్యతకు చెట్లు ఎంతో ముఖ్యమని పచ్చదనాన్ని కోల్పోతే భావితరాలకు నష్టం జరుగుతుందని బోత్ అటవీ శాఖ అధికారి కవిత పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా బోత్ బస్టాండులో మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అడవులను పరిరక్షించుకున్నట్లయితే అన్ని రకాల ఉపయోగముంటుందన్నారు.

మానవ మనగడకు చెక్కే ముఖ్యమని వివరించారు. ప్రతి ఇంటికి కనీసం మూడు మొక్కలు నాటాలని. ఆమె కోరారు. అడవి తో పాటు అటవీ జంతువులను కాపాడుకోవాలని సూచించారు అటవీ జంతువులను వేటాడితే శిక్షలు తప్పవని పేర్కొంటూ అటవీ చట్టాలను వివరించారు. కార్యక్రమంలో స్థానిక ఎస్సై వి పురుషోత్తం , డిప్యూటీ రేంజ్ అధికారి నాగరావు వసంత్ తో పాటు బీట్ ఆఫీసర్లు పాల్గొన్నారు