23 May, 2026 | 8:47 PM

పక్కా ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి

23-05-2026 07:52 PM

జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్

ఖానాపూర్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో పక్క ప్రణాళికతో గ్రామాల అభివృద్ధి చేపట్టాలని నిర్మల్ జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం ఖానాపూర్ మండలంలోని సత్తన్నపల్లిలో గల రైతు వేదిక లో సర్పంచులు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అధికారులు మాట్లాడుతూ జిపిడిపీ యాక్షన్ ప్రకారం హౌస్ టాక్స్, సుప్రీంకోర్టు జారీ చేసిన సివిల్ నెంబర్ 6 1 7 4 అమలులో ఉన్న ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు 2016 చర్యలకు భంగం కలగకుండా నిర్వహణ ,కొత్త నియమాలు రూపొందించడం, తడి వ్యర్ధాలు , పొడి వ్యర్థాల ,సానిటరీ వ్యర్ధాలు, చెత్త ప్లాస్టిక్ రీసైక్లింగ్ సాలిడ్ వేస్ట్ యాక్షన్ ప్లాన్ 2024 -25 కింద మంజూరైన గ్రాంటు పనుల పేర్లతో అప్రూవల్ ఉండవలెనని అన్ని అంశాలు గ్రామపంచాయతీ తీర్మానంతో ఆమోదం చేయాల్సి ఉంటుందని అన్నారు.