హైదరాబాద్ టు తుల్జాపూర్ పుణ్యక్షేత్ర టూర్ ప్యాకేజ్ ప్రకటించిన పికెట్ డిపో
05-03-2026 12:00 AM
సికింద్రాబాద్, మార్చి 3 (విజయక్రాంతి): పుణ్యక్షేత్ర దర్శనాలకు వెళ్లాలనుకునే భక్తుల కోసం పికెట్ డిపో ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి తుల్జాపూర్ వరకు ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సు సర్వీసును ఈనెల13 వ తేదీ నుండి నడపనున్నారు. ఈ యాత్రలో గానగాపూర్ దత్తాత్రేయ దేవాలయం, కొల్హాపూర్ మహాలక్ష్మి దేవాలయం, పండర్పూర్ విట్టల్ దేవాలయం మరియు తుల్జా భవాని దేవాలయం దర్శనములు కల్పించనున్నారు.
జూబ్లీ బస్ స్టేషన్ నుండి రాత్రి 8 గంటలకు, ఎంజీబీఎస్ నుండి రాత్రి 9 గంటలకు బయలుదేరే ఈ బస్సు యాత్ర అనంతరం సోమ వారం ఉదయం 5 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. సర్వీసు నెంబర్ 95565 కాగా, ఒక్కొక్కరికి రూ.3,500 చార్జి నిర్ణయించారు. ఆసక్తిగల భక్తులు పికెట్ డిపోను సంప్రదించాలని అధికారులు తెలిపారు.




