calender_icon.png 14 February, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో నమీరా జబీన్‌కు పిహెచ్‌డి ప్రదానం

14-02-2026 04:57:31 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): స్కూల్ ఆఫ్ ఫార్మసీకి చెందిన పిహెచ్‌డీ స్కాలర్ నమిరా జబీన్ “డెవలప్‌మెంట్ అండ్ వాలిడేషన్ ఆఫ్ బయో అనలిటికల్ మెథడ్ ఫర్ ఎస్టిమేషన్ ఆఫ్ సెలెక్టెడ్ డ్రగ్స్ ఇన్ బయోలాజికల్ మ్యాట్రిక్స్ యూజింగ్ లిక్విడ్ క్రోమాటోగ్రఫీ, టాండమ్ మాస్ స్పెక్ట్రోమెట్రీ అనే థీసిస్‌కు గాను ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో పిహెచ్‌డీ అవార్డును ప్రదానం చేసినట్లు అనురాగ్ విశ్వవిద్యాలయం ప్రకటించింది. ఈ పరిశోధన స్కూల్ ఆఫ్ ఫార్మసీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం. అకీఫుల్ హక్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా పూర్తయ్యింది. 

ఫిబ్రవరి 9న నిర్వహించిన తుది డిఫెన్స్ వైవా వోస్‌కు హైదరాబాద్‌లోని సిఎస్ఐఆర్, ఐఐసిటి ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ కె. సురేష్ బాబు, డీన్ డాక్టర్ సతీష్ కుమారన్, డైరెక్టర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ముథా రెడ్డి, రిజిస్ట్రార్ డాక్టర్ ఎ. పద్మనాభరావు, డీన్ డాక్టర్ వసుధా బక్షి,  ప్రొఫెసర్ డాక్టర్ జి. కిరణ్ తదితర అధ్యాపకులు, పరిశోధకులు హాజరయ్యారు. హైఫనేటెడ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ను ఉపయోగించి హ్యూమన్ ప్లాస్మాలో నిర్వహించిన ఆధునిక బయోఅనలిటికల్ సాంకేతికతలపై చేసిన ఈ పరిశోధనను పరీక్షా కమిటీ సభ్యులు ఎంతో అభినందిస్తూ, దీని అకాడమిక్ మరియు పరిశోధనా ప్రాముఖ్యతను ప్రశంసించారు.