14 July, 2026 | 9:33 PM

ప్రాజెక్ట్ ఆరోగ్యతో మహిళలకు మీనాక్షి ఎనర్జీ సేవలు

14-07-2026 09:30 PM

నెల్లూరు, జూలై 14, 2026: 

సమాజ ఆరోగ్యాభివృద్ధి , మహిళల సంక్షేమం పట్ల వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ తన నిబద్ధతను మరోసారి చాటుకుంది. తన ప్రధాన కార్పొరేట్ సామాజిక బాధ్యత  కార్యక్రమమైన ప్రాజెక్ట్ ఆరోగ్య కింద, తమ్మినపట్నం పంచాయతీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన జయభారతి హాస్పిటల్ సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో ప్రజనన మార్గ సంక్రమణలు , రక్తహీనత (అనీమియా), ఇతర స్త్రీరోగ సంబంధిత ఆరోగ్య సమస్యలపై నివారణాత్మక ఆరోగ్య పరీక్షలు, వైద్య సంప్రదింపులు, చికిత్సలు అందించబడ్డాయి. రోజంతా నిర్వహించిన ఈ శిబిరంలో 100 మందికి పైగా మహిళలు ఆరోగ్య సేవలను పొందారు.

జయభారతి హాస్పిటల్‌కు చెందిన స్త్రీరోగ నిపుణులు (గైనకాలజిస్టులు) మరియు జనరల్ ఫిజీషియన్లు పాల్గొన్న వైద్య బృందం సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, వైద్య సలహాలు అందించడంతో పాటు అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆరోగ్య సేవలను మరింత చేరువ చేయడం, ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించడం, అలాగే మహిళల్లో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యంగా ఉంది.

ఈ సందర్భంగా వేదాంత పవర్ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) రాజిందర్ సింగ్ ఆహుజా మాట్లాడుతూ, "వేదాంత పవర్ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రాంతాల్లో సమాజ ఆరోగ్యాభివృద్ధి మా సామాజిక బాధ్యత కార్యక్రమాల్లో అత్యంత కీలకమైన అంశం. కుటుంబాలు, సమాజం, దేశ అభివృద్ధికి మహిళల ఆరోగ్యం ఎంతో కీలకం. ప్రాజెక్ట్ ఆరోగ్యలో భాగంగా నిర్వహిస్తున్న ఇటువంటి నివారణాత్మక ఆరోగ్య కార్యక్రమాల ద్వారా ఆరోగ్యంపై అవగాహన పెంపొందించడం, సకాలంలో వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడం, ఆరోగ్య సమస్యల ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించే అలవాటును ప్రోత్సహించడం తమ లక్ష్యమని తెలిపారు.

ఈ వైద్య శిబిరాన్ని వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ లిమిటెడ్ ముఖ్య కార్యనిర్వాహణ అధికారి (సీఈఓ) కె. బి. బిను రాఫెల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మహిళా లబ్ధిదారులతో మాట్లాడి, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం, అలాగే కుటుంబాలు మరియు సమాజంలో నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై అవగాహన పెంపొందించడం ఎంత ముఖ్యమో వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవల ప్రాప్యతను మరింత మెరుగుపరచే క్రమంలో, ప్రాజెక్ట్ ఆరోగ్య కింద పరిసర గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డుల నమోదును కూడా వేదాంత పవర్ మీనాక్షి ఎనర్జీ చేపడుతోంది.