calender_icon.png 14 February, 2026 | 6:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బ్యాంకింగ్ సేవలపై ఉపాధి హామీ వర్కర్లకు అవగాహన

14-02-2026 05:03:20 PM

పెంచికలపేట,(విజయక్రాంతి): పెంచికలపేట మండలంలోని ఎల్కపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ వర్కర్లకు బ్యాంకింగ్ సేవలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మల్లేష్ వర్కర్లకు బ్యాంకింగ్ లావాదేవీలపై విస్తృతంగా వివరించారు. ఈ సందర్భంగా బ్యాంక్ ఖాతాల వినియోగం, కేవైసీ (KYC) ప్రాముఖ్యత, డిజిటల్ లావాదేవీలు, కేంద్ర ప్రభుత్వ పథకాలైన పీఎంఎస్‌బీవై, పీఎంజేజేబీవై, ఏపీవై గురించి అవగాహన కల్పించారు.

అలాగే డీఈఏ ఫండ్, నామినీ నమోదు అవసరం, సైబర్ మోసాల నుంచి రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మోసం జరిగినప్పుడు వెంటనే ఫిర్యాదు చేయాల్సిన 1930 హెల్ప్‌లైన్ నంబర్ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో రౌతు శేఖర్, ఎల్లంకి రాజబాబుతో పాటు ఎల్కపల్లి గ్రామ పంచాయతీ సీనియర్ మేట్ మహంకాళి శ్రీశైలం పాల్గొన్నారు.