14-02-2026 04:53:20 PM
నియామక పత్రాన్ని అందజేసిన డివిజన్ అధ్యక్షుడు దేశాయిపేట్ ప్రశాంత్
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని సంగోజిపేట్ గ్రామంలో శనివారం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని సంఘ సభ్యులు ఏకగ్రీవంగ ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షుడిగా శేకోళ్ల శ్రీకాంత్ ప్రధాన కార్యదర్శిగా జింక సాయిరాం, ఉపాధ్యక్షులుగా పోశయ్య కోశాధికారిగా చేకూల శంకర్ ప్రత్యేక సలహాదారులుగా జింక పోచయ్య, నీరడి కిష్టయ్య సభ్యులుగా సేకోల సాయిబాబా కాశవ్వ సాయిలు సురేష్ చిన్న స్థాయిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు డివిజన్ అధ్యక్షుడు దేశభక్తి ప్రశాంత్ తెలిపారు.
వారికి నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంగోజీ పేట్ లో నూతన అంబేద్కర్ విగ్రహం ప్రతిష్టాపన కోసం తొందరగా నిర్ణయం తీసుకొని అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులను చేపట్టాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ నర్సింలు, జిల్లా ఉపాధ్యక్షులు గైని రవి, డివిజన్ ఉపాధ్యక్షులు మన్నే చిన్న సాయిలు, కొత్తబాద్ మాజీ సర్పంచ్ సాయిలు మండల్ ఉపాధ్యక్షులు పోతురాజు సాయిలు డివిజన్ నాయకులు పరిమెల సాయిలు పోతురాజు లింగం కోనాపూర్ సాయిలు తదితరులు పాల్గొన్నారు.