ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
14-07-2026 08:35 PM
గజ్వేల్: గజ్వేల్ పట్టణంలో ఓ వ్యక్తి మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గజ్వేల్ పట్టణంలోని రామాలయం పరిసరాలలో నివసించే అయిల తిరుపతి(45) ఆర్థిక కారణాలతో మంగళవారం ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కాగా వంశపారంపర్యంగా వస్తున్న భూ లావాదేవీల విషయంలో మనస్తాపం చెందినట్లు స్థానికులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






