ఫేజ్ 56,147 సీట్లు భర్తీ
- కామర్స్‌లో 23,214, భౌతిక శాస్త్రంలో 14,394 సీట్లు..
- దోస్త్ ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌కు 23వ తేదీ వరకు గడువు
- తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి
హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): దోస్త్ తొలి విడత సీట్లను విద్యార్థులకు కేటాయించారు. 61,543 మంది వెబ్ ఆప్షన్లు పెట్టుకోగా, అందులో 56,147 మంది సీట్లు పొందారు. మాసాబ్ ట్యాంక్‌లోని తెలంగాణ ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో గురువారం నిర్వ హించిన మీడియా సమావేశంలో తొలి విడత సీట్ల వివరాలను విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ ప్రొ.మహమ్మూద్, కార్యదర్శి ప్రొ.శ్రీరామ్ వెంకటేశ్ వివరించారు.
ఈ సందర్భంగా విద్యామండలి చైర్మన్ ప్రొ.వి.బాలకిష్టారెడ్డి మాట్లాడుతూ ఫేజ్ 84,610 మంది విద్యార్థులు సీట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని పేర్కొన్నారు. సీట్లు పొందిన వారిలో అబ్బాయిలు 19,845, అమ్మా యిలు 36,302 మంది ఉన్నారని వెల్లడిం చారు. అయితే టాప్ 20లో 16 మంది అమ్మాయిలే ఉన్నారని తెలిపారు. వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నా సీట్లు పొందని అభ్యర్థులు 5,396 మంది ఉన్నట్లు చెప్పారు. ప్రథమ ప్రాధాన్యత కింద సీట్లు పొందిన వారు 36,634 మంది ఉన్నారని, ఇతరులు 19,513 మంది ఉన్నారని పేర్కొన్నారు.
అత్యధికంగా కామర్స్ వైపే..
విభాగాల వారీగా సీట్ల కేటాయింపులు చూస్తే అత్యధికంగా కామర్స్ కోర్సునే విద్యార్థులు ఎంచుకున్నారన్నారు. సీటు పొందిన విద్యార్థులు శుక్రవారం నుంచి ఈనెల 23వ తేదీ వరకు ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, ఒక వేళ చేయకుంటే వారి సీటు రద్దవుతుందన్నారు.
నేటి నుంచి ఫేజ్ 2
ఫేజ్ 2 రిజిస్ట్రేషన్లు శుక్రవారం (నేడు) నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఉంటాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. సీట్లను ఈనెల 30వ తేదీన కేటాయిస్తామని దోస్త్ పరిధి లోకి రాని కళాశాలల్లో 79 ప్రభుత్వ రెసిడె న్షియల్ కాలేజీలు, 60 ప్రైవేట్ ఉన్నాయని చైర్మన్ తెలిపారు.
ఒక్క సీటు నిండని కాలేజీలు 79
ఒక్క సీటు నిండని కాలేజీలు 79 ఉండగా, వంద శాతం సీట్లు నిండిన కాలే జీలు ఏడు ఉన్నాయని చైర్మన్ బాలకిష్టారెడ్డి తెలిపారు. కొత్త కోర్సులను ఈసారి ప్రవేశ పెడుతున్నామని, ఫేజ్ నుంచి అవి అందుబాటులోకి వస్తాయన్నారు. దీనికి అనుగుణంగా వర్సిటీలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కోర్సుల వారీగా సీట్ల కేటాయింపులు
ఆర్ట్స్ 8415
కామర్స్ 23,214
జీవ శాస్త్రాలు 9815
ఫిజికల్ సైన్సెస్ 14,394
ఇతరులు 309
మొత్తం 56,147
మీడియం వారీగా సీట్ల భర్తీ..
ఇంగ్లీష్ 54,608
తెలుగు 1,131
ఉర్దూ 396
హిందీ 07
అరబిక్ 05






