30 June, 2026 | 4:20 PM

నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం..

30-06-2026 03:19 PM

- అచ్చంపేటలో విజయవంతంగా 4వ విడత మెగా సర్జికల్ క్యాంప్

అచ్చంపేట: నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ ఆధ్వర్యంలో అచ్చంపేట ఏరియా ఆసుపత్రిలో నాల్గవ విడత మెగా సర్జికల్ క్యాంప్ విజయవంతంగా కొనసాగుతోంది. గతంలో మూడు విడతలుగా నిర్వహించిన మెగా సర్జికల్ క్యాంపుల ద్వారా అనేక మంది నిరుపేదలకు ఉచిత శస్త్రచికిత్సలు అందించగా, నాల్గవ విడతకు కూడా ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్యాంప్‌లో పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పొరేట్ ఆసుపత్రుల స్థాయి వైద్య సేవలు, ఉచిత శస్త్రచికిత్సలు అందిస్తున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో చికిత్స పొందలేని రోగులకు ఈ కార్యక్రమం ద్వారా మెరుగైన వైద్య సేవలు అందడంతో వారి జీవితాల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ముక్యంగా మహిళల్లో నెలకొన్న సమస్యలు, కణితి, ఎముకలు, తదితర వాటికీ చికిత్స అందిస్తున్నారు. ప్రజాప్రతినిధిగా ప్రజాసేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, పదవులు మారినా సేవాభావం మారలేదని ఈ కార్యక్రమం ద్వారా మరోసారి చాటిచెప్పారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఈ మెగా సర్జికల్ క్యాంప్ ద్వారా వందలాది మంది పేద రోగులకు చికిత్స అందించి, వారి ఆరోగ్య పరిరక్షణకు తోడ్పడుతున్నారు.