29 April, 2026 | 1:34 PM

బంకులు బంద్.. ప్రజలు పరేషాన్

27-04-2026 09:15 AM

జిల్లా వ్యాప్తంగా ఆయిల్ కోరత

చేతులేత్తిసిన పెట్రోల్ యజమాన్యం

పెట్రోల్ కోసం గంటలకొద్ది క్యూలో లైన్ లో పడిగాపులు

ఖమ్మం,(విజయక్రాంతి): యుద్ద ప్రభావమా..? అధికారుల వైఫల్యమా..? యజమానుల ప్లానా..? తెలియదు కానీ.. వాహనదారులకు శాపంగా మారింది. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడింది. ఏ పెట్రోల్ బంక్ లో కూడా పెట్రోల్, డీజిల్ లేదు. అన్ని పెట్రోల్ బంక్ ల్లో నో స్టాక్ బోర్డులను ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలు, వాహదారులు పరుగులు తీశారు.. వాహనాలతో, వాటర్ బాటళ్లు, క్యాన్లను తీసుకుని బంక్ ల వద్దకు పరుగులు తీశారు.

గంటల వ్యవధిలోనే పెట్రోల్, డీజిల్ కొరత అంటూ ప్రచారం కావడంతో వాహనదారులు పెట్రోల్ బంక్ లకు పరుగులు తీశారు. గంటల కొద్ది క్యూలైన్ లో నిలబడి పెట్రోల్, డీజిల్ తీసుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం, సత్తుపల్లి, వైరా, భద్రాచలం, కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, మధిర లాంటి మున్సిపాలిటీ ప్రాంతాల్లో  ఆయిల్ కొరత ఏర్పడింది. ఉదయం సమయానికే అన్ని బంకుల్లో ఆయిల్ అయిపోవడంతో పల్లెటూర్లకు పరుగులు తీశారు. అక్కడ కూడా మధ్యాహ్నం సమయానికి నో స్టాక్ బోర్డు పెట్టేశారు. 

ఎండను సైతం లెక్కచేయకుండా..?

బంక్ లలో పెట్రోల్, డీజిల్ లేదంటా..? అనే ప్రచారంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాహనదారులు బంకుల వద్దకు వెళ్లి పెట్రోల్, డిజిల్ కోసం వెళ్లారు. నాలుగైదు బంక్ లు తిరిగినప్పటికి ఆయిల్ లేకపోవడంతో ప్రజలు  తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ ఉన్న ఒకటి, రెండు బంక్ ల వద్ద వాహనదారులు గంటల కొద్ది క్యూలైన్ లో నిలబడి పెట్రోల్, డీజిల్ తీసుకున్నారు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా పెట్రోల్, డీజిల్ కోసం గాలించారు. గంటల తరబడి క్యూలైన్ లో ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పెట్రోల్ అందుబాటులో ఉన్న బంక్ ల వద్ద ప్రజలు గొడవ పడ్డారు. నేనంటే నేనే ముందు అంటూ వాగ్వాదం పడ్డారు. చివరి పోలీసులు రంగప్రవేశంతో సమస్య కొలిక్కి వచ్చింది.

 అధికధరలకు పెట్రోల్, డీజిల్ విక్రయిస్తున్న వ్యాపారులు

బంక్ ల్లో పెట్రోల్, డీజిల్ అయిపోయిందనే సమాచారంతో కొందరు వ్యాపారులు అడ్డగోలుగా దొచుకున్నారు. లీటర్ పెట్రోల్ కు రూ. 50 నుంచి రూ.100 అధనంగా వసూల్ చేసి విక్రయించారు. అధిక ధర ఉన్నప్పటికి చేసిది లేక వాహనదారులు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. దీంతో ఒక్క రోజే భారీగా దండుకున్నారు. 

బంక్ ల వద్ద ఆందోళన

పెట్రోల్, డీజిల్ కొరత ఉందనే ప్రచారంతో ఆయా పెట్రోల్ బంక్ ల వద్దకు పరుగులు తీసిన ప్రజలు బంక్ ల వద్ద ఆందోళన చేశారు. డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం ముందుచూపు లేకపోవడమే కారణం అని ఆరోపించారు. తక్షణమే అన్ని కేంద్రాలకు పెట్రోల్ , డీజిల్ ట్యాంకర్లను పంపించాలని, ఆయిల్ కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజా  సంఘాలు, వివిధ పార్టీల నాయకులు మండిపడుతున్నారు.