గొల్లగూడెంలో బడిబాట
27-04-2026 02:38 AM
దమ్మపేట, ఏప్రిల్ 26, (విజయక్రాంతి): మండల పరిధిలోని డి గొల్లగూడెం ఆశ్రమ పాఠశాల ఆధ్యర్యంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా బడి బాటను హెచ్ ఎం చంద్రకళ ఆధ్వర్యంలో నిర్వహించారు. గ్రామస్తులకు పాఠశాల విద్య పట్ల అవగాహన కల్పించి, ఆశ్రమ పాఠశాలల్లో విద్యావిధానం గురించి వివరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, వర్కర్లు, గ్రామస్తులు విద్యార్ధులు తదితరులు పాల్గొన్నారు.






