14 July, 2026 | 4:36 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

పిట్టంపల్లి గ్రామంలో పరిశ్రమల కాలుష్యంపై కలెక్టర్‌కు వినతి

14-07-2026 12:00 AM

చిట్యాల, జూలై 13 : నల్లగొండ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో చిట్యాల మండలం పిట్టంపల్లి గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గ్రామ పరిసరాల్లో ఉన్న స్థానిక పరిశ్రమల నుంచి గత కొన్ని రోజులుగా తీవ్రమైన కాలుష్యం వెలువడుతోందని, దట్టమైన పొగ, దుర్వాసన, ధూళి కారణంగా గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

కాలుష్యం వల్ల శ్వాసకోశ సంబంధిత సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య ఇబ్బందులు కూడా పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యానికి కారణమైన పరిశ్రమలపై వెంటనే సమగ్ర విచారణ చేపట్టి, కాలుష్య నియంత్రణకు కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను కోరారు.