14 July, 2026 | 3:49 PM

Breaking News

మోదీ, అమిత్ షా స్పందిచరెందుకు?.. 23న మౌనదీక్ష చేస్తా: వీహెచ్   •   కార్మికులకు ఆరోగ్య భరోసా   •   సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే వినోద్ బుద్ది మారాలని మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య పూజలు   •   దుర్గాభవానీ అమ్మవారికి ప్రత్యేక పూజలు   •   అర్హులైన ప్రతి ఒక్కరు ఎస్ఐఆర్లో దరఖాస్తు సమర్పించుకోవాలి   •   చేర్యాలలో మంగళ, శుక్రవారం "డ్రై డే” పాటించాలి   •   ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరు తమ పేరు నమోదు చేసుకోవాలి: సర్పంచ్ ఆనంద్ నాయక్   •   పసిపిల్లల ఎదుగుదలకు తొలిముద్దు తోడ్పాటు   •   సుల్తానాబాద్ గోదాముల ఎదుట రైస్ మిల్లర్స్ ఆందోళన   •   సింగరేణి రక్షణకు.. కార్మిక సంఘాలు కలిసికట్టుగా పని చేయాలి   •  

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

14-07-2026 12:00 AM

కుమ్రం భీం ఆసిఫాబాద్, జూలై 13 (విజయక్రాంతి): జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ కె. హరితకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు టి. సురేందర్ రావు, ప్రధాన కార్యదర్శి పర్వతి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జిల్లా, మండల కేంద్రాల్లో పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని, అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే టీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో దశలవారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడబ్ల్యూజేఎఫ్ ఉపాధ్యక్షుడు పి. నాగేందర్, కోశాధికారి జె. లలిత్ కుమార్, సభ్యులు బి. కిరణ్ కుమార్, ముకశిర్ పాషా, ఎం. యాదగిరి, బి. వెంకన్న, పి. సంతోష్, ఎం.డి. ఇసాక్, ధనుంజయ్, జయంత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.