4 March, 2026 | 6:08 PM

కంపెనీల అనుమతుల రద్దుపై ఎమ్మెల్యేకు వినతి

04-03-2026 03:05 PM

భిక్కనూర్,(విజయ క్రాంతి): భిక్కనూర్ మండల పరిధిలో నూతనంగా అనుమతులు పొందిన పలు కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కోరుతూ బుధవారం పెద్దమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్, పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డికు వినతి పత్రం అందజేశారు.

ఎంఎస్‌ఎన్, ఫ్యూజన్ ఫార్మా, జెన్స్ అడ్సార్ప్షన్, వేదా గ్రానెట్ కంపెనీల వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని పేర్కొంటూ గ్రామ సభలో తీర్మానం చేశారు. బుధవారం భిక్కనూర్ రైతు వేదికలో జరిగిన ఎమ్మెల్యే కార్యక్రమంలో ఈ వినతిని అందజేసి పచ్చని పల్లెలను కాపాడాలని కోరారు.