4 March, 2026 | 6:06 PM

మలుపులు.. తరచూ ప్రమాదాలు

04-03-2026 03:03 PM

వాంకిడి నుంచి బండ కాసా వెళ్లే రహదారిలో మలుపు 

.. కనీస సూచిక బోర్డులు కరువు 

.. రాకపోకలకు వాహనదారుల అవస్థలు 

.. పట్టించుకోని అధికారులు

వాంకిడి,(విజయక్రాంతి): మండలంలోని గ్రామాలకు వెళ్లే రహదారులకు మూలమల్పులు ప్రమాదకరంగా మారాయి. సూచిక బోర్డులు లేకపోవడంతో తరుచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. మండల పరిధిలో ఖమాన, దుబ్బగూడా, కనర్గాం, ఇందాని, జైత్పూర్, వెల్గి, చౌపన్ గూడా, పిప్పర్ గొంది, పిచ్చిపల్లి ఆయా గ్రామాలకు వెళ్లే దారుల్లో మలుపులు అధికంగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఆయా గ్రామాల్లో మలుపుల వద్ద సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఈ మార్గాల్లో తరచు ప్రమాదాలు సంభవిస్తున్న అధికారులు పట్టించుకోవడంలేదని వాహనదారులు, స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా పెరిగిన చెట్ల పొదలను తొలగించాలని పలురు కోరుతున్నారు.