4 May, 2026 | 11:08 PM

కొండాపూర్ లో లైమ్‌లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ కొత్త స్టోర్

04-05-2026 09:58 PM

మే 2026, హైదరాబాద్: ప్రముఖ లైమ్‌లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ తెలంగాణలో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. భారతదేశంలోనే అతిపెద్ద విశ్వసనీయమైన జ్యువెలరీ బ్రాండ్ గా గుర్తింపు పొందిన లైమ్ లైట్ కొండాపూర్‌లో ఒక కొత్త ప్రత్యేకమైన స్టోర్‌ను ప్రారంభించింది.  వేగంగా అభివృద్ధి చెందుతున్న పట్టణ మార్కెట్లలో తమ బ్రాండ్ ని ఉనికిని మరింతగా విస్తరించడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది.

ఈ స్టోర్ ప్రారంభోత్సవానికి లైమ్‌లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ డైరెక్టర్ కరమ్‌జ్యోత్ సింగ్ చావ్లా, ప్రాంతీయ భాగస్వాములు గణేష్ బెలిడే, సాయి నిఖిల్ బెలిడే, సాయి రితిక్ బెలిడే హాజరయ్యారు. ఈ కొత్త స్టోర్ కలెక్షన్‌లో క్లాసిక్ సోలిటైర్లు, సమకాలీన నెక్లెస్‌లు, స్టేట్‌మెంట్ చెవిపోగులు, బ్రేస్‌లెట్‌లు , ప్రత్యేక సందర్భాలకు, అలాగే ఆధునిక రోజువారీ వాడకానికి సరిపోయే బహుముఖ నిత్యవసర ఆభరణాలు ఉన్నాయి.  ఆభరణాల పట్ల బలమైన సాంస్కృతిక అనుబంధం మరియు డిజైన్ స్పృహ కలిగిన యువ వినియోగదారుల సంఖ్యతో, హైదరాబాద్ ల్యాబ్ గ్రోన్ డైమండ్ విభాగానికి ఒక ముఖ్యమైన అవకాశాన్ని అందిస్తోంది.

కొండాపూర్ లో సరికొత్త స్టోర్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, వినియోగదారులకు ప్రత్యేకమైన ప్రారంభ ఆఫర్‌లను కూడా ప్రకటించింది.  ఈ సందర్భంగా లైమ్‌లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ వ్యవస్థాపకురాలు మరియు మేనేజింగ్ డైరెక్టర్ పూజా మాధవన్ మాట్లాడుతూ బలమైన ఆభరణాల సంస్కృతి మరియు వేగంగా మారుతున్న వినియోగదారుల ఆలోచనా విధానం కారణంగా హైదరాబాద్ తమకు ఒక ముఖ్యమైన మార్కెట్ గా మారిందని చెప్పారు. 

 కొండాపూర్ స్టోర్ ప్రారంభం సందర్భంగా లైమ్‌లైట్ ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ డైరెక్టర్ కరమ్‌జ్యోత్ సింగ్ చావ్లా మాట్లాడుతూ తమ విస్తరణ వ్యూహం, కీలకమైన పట్టణ ప్రాంతాలలో బలమైన రిటైల్ ఉనికిని నిర్మించడమేనని తెలిపారు. అదే సమయంలో మెట్రో నగరాల్లోని అభివృద్ధి చెందుతున్న పరిసర ప్రాంతాలపై దృష్టి సారించడాన్ని గుర్తు చేశారు.