4 March, 2026 | 5:06 PM

మనువళ్ళతో హోలీ సంబరాల్లో పాల్గొన్న పోచారం

04-03-2026 03:29 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): హైదరాబాదులోని బంజారాహిల్స్ లో తన కుటుంబ సభ్యులు,మనుమలు రిషిక్ రెడ్డి, రుషాంక్ రెడ్డి లతో   కలిసి బుధవారం స్వగృహంలో హోళీ సంబరాల్లో ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి పాల్గొని రంగులు చల్లుకున్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ హోలీ పండుగ మన అందరి జీవితాల్లో కొత్త రంగులు నింపాలని,కామ దహనం చేసి,రంగులు చల్లుకుని,ఆనందం పంచుకుని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయన కోరారు.