వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తి అదృశ్యం
అబ్దుల్లాపూర్ మెట్, ఆగస్టు 23: వాకింగ్ కోసం అని వెళ్ళిన వ్యక్తి అదృశ్యమైన ఘటన అబ్దు ల్లాపూర్ మెట్ పో లీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లా పూర్ మెట్ మండలం ఉమర్ఖాన్ గూడ కు చెందిన పృథ్వీ రాజ్ దిగంబర్ జాదవ్ (19) ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు. ప్రతిరోజు వాకింగ్ వెళ్తుంటాడు. ఉదయం 5:30 నిమిషాల పెళ్లి తిరిగి ఉ.. 7: 00 ఇంటికి చేరుకుం టాడు. కానీ శనివారం ఉదయం వాకింగ్ కోసం అని బయటికి వెళ్లిన పృథ్వీ రాజ్ ది గంబర్ జాదవ్ తిరిగి సాయంత్రం అయినా ఇంటికి రాకపోవడంతో అతను ఫోన్ చే యగా స్విచ్ ఆఫ్ వచ్చింది. పై చదువులపై ఆ సక్తి లేకఢిల్లీ వెళుతున్నాను వాట్సాప్ సందేశం పంపించి..
ఫోన్ మళ్లీ ఆఫ్ చేశాడు. ఇంట్లో పరిశీలించగా అతని ల్యాప్టాప్, నాలుగు జతల దుస్తులు, స్టడీ సర్టిఫికెట్లు కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు గమనించారు. పృథ్వీ రాజ్ దిగంబర్ జాద వ్ కోసం బంధువులు, స్నేహితులు, చుట్టుపక్కల ప్రాంతాలలో వెతికినప్పటికీ అతని ఆచూకీ లభించకపోవడంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు న మోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్ స్పెక్టర్ అశోక్ రెడ్డి తెలిపారు.






