24 August, 2026 | 4:28 AM

సామాజిక, ప్రజా చైతన్యం కోసం కళాకారుల కలాలు, గళాలు ఉండాలి

24-08-2026 12:49 AM

సీపీఐ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి

కరీంనగర్, ఆగస్టు 23 (విజయక్రాంతి): సకల జనుల హితం కోసం, సామాజిక కోణంలో ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం కళాకారులు తమ కళాలకు, గళాలకు ప నిచెప్పాలని,కళాకారులు శిక్షణ ద్వారా తమ నైపుణ్యం పెంపొందించుకోవాలని సిపిఐ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

ఆదివారం కరీంనగర్ లోని బద్దం ఎల్లారెడ్డి భవన్ లో రెండు రోజుల పాటు జరిగే తెలంగాణ ప్రజానాట్య మండలి కళాకారుల శిక్షణ శిబిరంను చాడ వెంకట రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్ర జానాట్య మండలి కళాకారులని, అలాంటి కళాకారులు నిత్య విద్యార్థులుగా ఎన్నో విషయాలు తెలుసుకొని, పాటలు నేర్చుకొని పా డాలని అందుకు ఇలాంటి శిక్షణా శిబిరాలు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. కరీంనగర్ లో సెప్టెంబర్ 6 నుండి 8 వరకు జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర 4వ మహాసభల విజయవంతం కోసం కళాకారులు తమ వంతు గా కళారూపాలు ప్రదర్శించాలని వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల కార్యదర్శులు పంజాల శ్రీనివాస్, తాండ్ర సదానందం, ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షులు కురుమిద్ద శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహ, ఇప్టా జాతీయ కౌన్సిల్ సభ్యులు కవ్వంపల్లి స్వామి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి కటిక రెడ్డి బుచన్న యాదవ్, టేకుమల్ల సమ్మయ్య,ప్రజానాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షులు కన్నం లక్ష్మీనారాయణ, ఉప్పలయ్య, సహాయ కార్యదర్శి రేగుంట చంద్ర శేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యు లు గణేష్,వెంకటాచారి, రోంటాల శ్యామ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు దుడ్డేల సమ్మయ్య, వరకోలు సదా నందం, ఎజ్జ రాజయ్య, లక్ష్మీరాజం, ఆసాల రమ, ఇందిరా, లక్ష్మణ్, ఎర్రోజు శ్రీనివాస్, మోహన్, డప్పురాజు, తదితరులు పాల్గొన్నారు.