calender_icon.png 10 February, 2026 | 8:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పిరియాడిక్ దినోత్సవం

10-02-2026 05:36:25 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ పీరియాడిక్ టేబుల్ దినోత్సవాన్ని మంగళవారం జరుపుకున్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని  రసాయన శాస్త్ర విభాగం, విద్యార్థులు, అధ్యాపకుల చురుకైన భాగస్వామ్యంతో జాతీయ పీరియాడిక్ టేబుల్ దినోత్సవం–2026ను జరుపుకుంది. కార్యక్రమంలో భాగంగా, 1–118 మూలకాలు చూడకుండ చెప్పడం, పీరియాడిక్ టేబుల్ పోస్టర్ ప్రెజెంటేషన్ వంటి పోటీలు నిర్వహించబడ్డాయి.

ఈ సందర్భంగా ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో జూనియర్ లెక్చరర్ శ్రీ రంజిత్, జీవిత నైపుణ్యాల ప్రాముఖ్యతను తెలియ చేశారు. ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సుధాకర్ మద్నూరే, విజేతలు మరియు పాల్గొన్న వారందరినీ అభినందించారు. ఈ కార్యక్రమాన్ని సనా గజాలతో పాటు కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు కె. సూర్య సాగర్, జి. అర్చన నిర్వహించారు. విద్యార్థులు, అధ్యాపక సభ్యులు చురుకుగా పాల్గొని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.