18 July, 2026 | 4:42 PM

ప్రజలు పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేయాలి

18-07-2026 04:41 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని ధర్మారెడ్డి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు రకాల విషయాలపై గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా...గ్రామ సర్పంచ్ గులపల్లి లక్ష్మీనారాయణ తడి చెత్త, పొడి చెత్త,షానిటరీ చేత, ప్రత్యేక జాగ్రత్త చెత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ దూలపల్లి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ... గ్రామ ప్రజలు,గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే వ్యర్థ పదార్థాలు వేరు చేసి నేరుగా ఇంటి వద్దకు వచ్చిన గ్రామపంచాయతీ వాహనంలో చెత్తను అందజేయాలన్నారు. డంపింగ్ యార్డ్లో ఉన్న భౌగోళిక వ్యర్ధపదార్థాలను పరిశీలించి చెత్తను నాలుగు రకాలుగా వేరు చేయాలన్నారు.