ఘనంగా జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు
కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు
చివ్వెంల,(విజయక్రాంతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి, సూర్యాపేట హ్యాట్రిక్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలను శనివారం చివ్వెంల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఘనంగా నిర్వహించారు. చివ్వెంల మండల మాజీ సర్పంచ్‌ల ఫోరమ్ అధ్యక్షుడు, మాజీ సర్పంచ్ జూలకంటి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేక్ కట్ చేసి జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధికి, సూర్యాపేట జిల్లాకు కాళేశ్వరం జలాలను అందించడంలో జగదీష్ రెడ్డి చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుండే నాయకుడిగా ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో చివ్వెంల గ్రామ సర్పంచ్ ఏర్పుల కళ్యాణి నాగేష్, రాజు తండ సర్పంచ్ దారావత్ సరస్వతి భద్రు నాయక్, సేవాలాల్ తండ మాజీ సర్పంచ్ గుగులోత్ కవిత అనిల్ నాయక్, సూర్యానాయక్ తండ మాజీ సర్పంచ్ రాజు నాయక్, మాజీ ఎంపీటీసీ లచ్చిరాం నాయక్, చివ్వెంల గ్రామ ఉపసర్పంచ్ తుర్క మౌనిక హరీష్, బీఆర్ఎస్ నాయకులు, జేజేఆర్ యూత్ సభ్యులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జగదీష్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.






