calender_icon.png 10 February, 2026 | 8:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉప్పల్ నియోజకవర్గం అభివృద్ధి చేశాం

10-02-2026 05:41:34 PM

హైదరాబాద్ నగరమే కాకుండా తెలంగాణలో అన్ని మున్సిపాలిటీలు అభివృద్ధి చేశాం: మంత్రి శ్రీధర్ బాబు 

ఉప్పల్,(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 380 కోట్లతో ఉప్పల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని ఐటీ పరిశ్రమల శాఖ దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. ఉప్పల్ నియోజకవర్గం లోని 116 కోట్ల అభివృద్ధి పనులను ప్రభుత్వ చీఫ్ విప్ పట్టణ మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  గత ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు 195 కోట్ల 20 లక్షలు రూపాయలతో అభివృద్ధి పనులు చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల కాలంలోనే  300 కోట్ల నిధులు ఉప్పల్ నియోజకవర్గ  అభివృద్ధి కేటాయించామని ఆయన తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టణాభివృద్ధి మున్సిపాలిటీ కార్పొరేషన్ ప్రత్యేక మౌలికోసతులపై కేంద్రీకరించి కార్యచరణగా గ్రేటర్ హైదరాబాద్ కాకుండా అన్ని మున్సిపాలిటీ కార్పొరేషన్లను అభివృద్ధి నిధులు కేటాయించి  కార్పొరేషన్ పెద్ద ఎత్తున నిధులు ఇచ్చిన రెండు సంవత్సరాల్లో సంవత్సరాల్లో చిత్తశుద్ధి ఒక కార్యచరణ తీసుకొని మేము నిదర్శనంగా నిలిచామన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో నల్లచెరువు 20 కోట్ల రూపాయలతో  ఆధురీకరణగా అక్కడున్న కాలుష్య నివారణ ఎస్ టి పి ప్లాంట్  ఏర్పాటు ఏర్పాటుచేసి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తా ఉన్నామని అని ఆయనపేర్కొన్నారు.

బతుకమ్మ చెరువు నల్లచెరువు వంటి చెరువులు అభివృద్ధి చేసి హైదరాబాద్ జంట నగరాల్లో ఉదాహరణగా నిలబడ్డామన్నారు. హైడ్రా పేరుతో గ్రేటర్ హైదరాబాద్ అభివృద్ధి జరగదు అనే నేపంతో టిఆర్ఎస్ బిజెపి పార్టీలు లేనిపోని భయాలను ప్రజల మధ్య సృష్టిస్తున్నారన్నారు. బిజెపి టీఆర్ఎస్ పార్టీలు నల్లచెరువు కొచ్చి అభివృద్ధి పనులను చూసి మాట్లాడాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు  రజిత పరమేశ్వర్ రెడ్డి బొంతు శ్రీదేవి  గ్రేటర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు