పరిసరాల పరిశుభ్రతతో ఆరోగ్యం
ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
భూత్పూర్, మార్చి 10: పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో భాగంగా భూత్పూర్ మున్సిపాలిటీలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మన నివాస గృహంతో పాటు మున్సిపాలిటీ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉం చుకోవాలన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్య క్రమంలో మున్సిపాలిటీలో పారిశుద్ధ్య పై ప్రధాన దృష్టి సారించామని తెలిపారు.
భూ త్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటితో పాటు, వార్డు కౌన్సిలర్లు, సీనియర్ పార్టీ నాయకులు కలిసి చౌ రస్తాలో రోడ్లను శుభ్రం చేశారు. అదేవిధంగా డ్రైనేజీలో ఉన్న చెత్త చదారాన్ని వారు తీసివేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పరిశు భ్రత, ఆరోగ్యం, యువత, క్రీడలు, విద్య, పిల్లల భద్రత, డ్రగ్స్ కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం, వ్యవసాయం, మహిళలు, పర్యావరణం వంటి కీలక అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టితో ప్రగతివైపు అడుగులు వేస్తుందన్నారు.
ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, శానిటేషన్ వ్యవస్థను మరింత బలపతం చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలని సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తుందన్నారు. కాలనీ లు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ యంత్రాం గం సమర్థవంతంగా పనిచేయాలని అన్నారు.
ప్రతి పౌరుడు కూడా పరిశుభ్రతను కాపాడడంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని రైతు వేదిక వద్ద భూత్పూర్, అడ్డాకుల, మూసాపేట్ మండలాల రైతులకు స్పిన్కర్లు ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మూడవత్ బాలకోటి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కి నవీన్ గౌడ్, వార్డు కౌన్సిలర్లు లిక్కి సూర్య కళ, పద్మ నరేందర్, లాలూ నాయక్ తో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లిక్కి విజయ్ గౌడ్, హర్యానాయక్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.




