ఇతర రాష్ట్ర వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
హుజూర్ నగర్ సీఐ చరమందరాజు
హుజూర్ నగర్, మే 18: ఇతర రాష్ట్ర వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హుజూర్ నగర్ సీఐ చరమందరాజు అన్నారు.సోమవారం పట్టణంలోని సిఐ కార్యాలయంలోని సర్కిల్ పరిధిలోని పలు బేకరీలు,టీస్టాళ్లు, ఇటుక బట్టీలలో పనిచేసే ఇతర రాష్ట్ర వలస కార్మికులకు కౌన్సిలింగ్ నిర్వహించి మాట్లాడారు...
పక్క రాష్ట్రాలైన బీహార్,ఒరిస్సా,కేరళ చత్తీస్గడ్ నుంచి వలస వచ్చే కూలీలు మీరు పనిచేసే స్థానిక ప్రజల పట్ల జాగ్రత్తగా నడుచు కోవాలన్నారు. అనుమానస్పద వ్యక్తులుగా కనిపించినట్లయితే వెంటనే 100కు డయల్ చేసి సమాచారం అందించాలన్నారు.అనంతరం ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలకు 35 మందిని హుజూర్ నగర్ తహశీల్దార్ వద్ద బైండోవర్ చేశారు.ఈ కార్యక్రమంలో యస్‌ఐ చలికంటి నరేష్,పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






