30 July, 2026 | 12:47 PM

రానున్న రెండు రోజులు భారీ వర్షాలు

30-07-2026 12:24 PM

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక

భూపాలపల్లి, జూలై 30 (విజయక్రాంతి): వాతావరణ శాఖ సూచనలతో రానున్న రెండు రోజుల పాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) హెచ్చరించారు. ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.అవసరం లేకుండా బయటకు రావొద్దని, తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తే జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. వాగులు, వంకలు, చెరువులు, కల్వర్టుల వద్దకు వెళ్లకుండా దూరంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా అన్నారు.

అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు కలెక్టరేట్‌లో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సహాయం అవసరమైన వారు 9030632608 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని, గ్రామం నుండి జిల్లా స్థాయి వరకు అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రహదారులపై నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల్లో ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు బారికేడ్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రతే ముఖ్యమని, అందరూ సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అలాగే పశువుల సంరక్షణకు కూడా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.