calender_icon.png 15 February, 2026 | 9:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి, సంక్షేమానికే ప్రజలు పట్టం కట్టారు

15-02-2026 12:36:12 AM

కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధర్ రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరును ప్రతిబింబింప చేస్తోందని, కాంగ్రెస్ ప్రజాపాలనకు ప్రజామోదం లభించిందని కాంగ్రెస్ సీనియర్ నేత కే మురళీధర్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభు త్వం చేపట్టిన విప్లవాత్మక సన్నబియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ ఛేంజర్ గా మారిందన్నారు.   

పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమల వుతున్న సంక్షేమ పథకాలకు ప్రజా మోదం లభించినట్లయిందని తెలిపారు. అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీతో పాటు రాష్ట్ర జనాభాలో 85 శాతం ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్య మైన సన్న బియ్యం పంపిణీ వట్టి ప్రతిష్టాత్మక కార్యక్రమాలతో పాటు మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, అర్హులైన నిరుపేద మధ్య తరగతి వర్గాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పథకాలు పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ విజయానికి దోహదం చేశాయని స్పష్టం చేశారు.

దీంతోపాటు రైతాంగానికి అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయని వెల్లడించారు. పురపాలక సంఘంఎన్నికల్లో ఫలితాలు ముందుగా ఊహించినవే నని, యావత్ తెలం గాణ సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికలు అద్దం పడుతున్నాయని తెలి పారు. ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో తాజాగా జరిగిన పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిం దని ఆయన వెల్లడించారు.