calender_icon.png 15 February, 2026 | 9:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆపద్బాంధవుడు.. కోండిల రాజు

15-02-2026 12:38:12 AM

ఎంతోమందికి సాయం చేసిన రాజు

వరంగల్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): మానసికంగా అంగవైకల్యం కల వ్యక్తిని చేరదీసి అక్కున చేర్చుకున్న కోండిల రాజు .. గ్రే టర్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్ పరిధిలో గల 40వ డివిజన్ నానామియా తో ట, కరిమాబాద్ లో మానవ సేవే మాధవ సేవా అని చందం తో ముందుకు వెళ్తున్న భాగంగా ఈ కార్యక్రమంలో  శనివారం స్థానిక మానసిక అంగవైకల్యం గల వృద్ధునికి సమయానికి ఆహారం తినిపించి పెట్టి అక్కున చేర్చుకొని తన సేవా గుణాన్ని చాటుకున్నాడు కోండిల రాజు. ఉర్సు గుట్ట ప్రాంతంలో మతి స్థిమితం లేని ఒక వ్యక్తి కీ సైతం పరిశుభ్రంగా స్నానం చేయించి తనకు కావాల్సిన వైద్యం ఉచితంగా అందించి న యం చేయించిన ఉదార స్వభావం గల వ్యక్తి కోండిల రాజు, సదరు డివిజన్‌లో ఎంతో మందిని ఇలా చేరదీస్తూ అక్కున చేర్చుకునే స్వభావం గల వ్యక్తి కోండిల రాజు.