2 July, 2026 | 1:12 AM

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

02-07-2026 12:02 AM

సీఎస్‌ను కలిసి కోరిన పెన్షనర్ల జేఏసీ

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీఎస్ సంజ య్ జాజుని పెన్షనర్ల జేఏసీ నేతలు బుధవా రం కలిసి తమ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. 2024 ఏప్రిల్ నుంచి రిటైరైన పెన్షనర్లకు చెల్లించాల్సిన మొత్తాలను ఒకే మొత్తంలో చెల్లించాలని, పీఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించుకుని దాన్ని అమలు చేయాలని కోరారు. సీఎస్‌ను కలిసిన వారిలో జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ తులసి సత్యనారాయణ, కో సూర్యనారాయణ, పుల్లయ్య, మోహన్ నారాయణ తదితరులున్నారు.