6 May, 2026 | 8:41 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్ ఇవ్వాలి

05-01-2026 02:04 AM

బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో లూయీస్ బ్రెయిలీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు దుస్తులు, దుప్పట్లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలు ఇస్తామని చెప్పి కాం గ్రెస్ విస్మరించిందన్నారు. దివ్యాంగులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. దివ్యాంగుల సంక్షే మంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టిసారించాలని, రూ.6 వేల పింఛన్‌తోపాటు ఉచిత బస్‌పాస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లిపిని కనుగొన్న లూయీస్ బ్రెయిలీ జీవితం ఎంతో మందికి ఆదర్శమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.