19 June, 2026 | 8:38 PM

పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి

19-06-2026 04:23 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో కొనసాగుతున్న బెస్ట్ అవైలబుల్ పాఠశాలలలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేసి విద్యార్థులకు అందవలసిన నోటి బుక్స్ యూనిఫామ్స్, హాస్టల్ వసతి వంటి ఉచిత సదుపాయాలకు అవరోధాలు కలగకుండా చూడాలని జిల్లా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్నకి వినతి పత్రం అందజేయడం జరిగింది. సమస్యని తొందరగా పరిష్కరించాలని లేని యెడల విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని తెలియజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కుంటోల్ల వెంకటస్వామి, జే.అశోక్, టీ.సురేందర్, ముత్యం, రమేష్ తదితర విద్యార్థి తల్లితండ్రులు పాల్గొన్నారు.