19 June, 2026 | 9:47 PM

Breaking News

నాగిరెడ్డిపేట్లో తెలంగాణ రక్షణ సమితి జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్   •   విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   చేనేత సంఘ పగ్గాలు చేపట్టిన అడ్వకేట్ నాగుల సత్యనారాయణ   •   ప్రేమ హత్య..? రెండు రోజుల క్రితం మిస్సింగ్   •   ప్రమాద బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా   •   వర్షాలు కురవాలని కోరుతూ... అల్లిపూర్ లో కప్పతల్లి ఆట   •   రాముడి పేరుతో ఓట్లు.. కార్పొరేట్ల కోసం పాలన   •   అధికారం పోయిన పిచ్చిలో మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్   •   పెద్దమ్మ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి   •   మేడిపల్లికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •  

జర్నలిస్టుల ఉద్యమం ఉధృతం

19-06-2026 08:23 PM

- రెండవ రోజు తహశీల్దార్ కు వనతి పత్రం 

- సమస్య పరిష్కారమయ్యే వరకు ఉద్యమం ఆగదు జర్నలిస్ట్ జేఏసి

సత్తుపల్లి,(విజయక్రాంతి): ఆర్సీ ఇంచార్జ్ గా పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా ఎడిషన్ కార్డులు ఇచ్చి రాష్ట్రస్థాయిలో బస్ పాస్ సౌకర్యం కల్పించాలని సత్తుపల్లి జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ తరపున జర్నలిస్టుల సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని స్థానిక ఎమ్మార్వో పున్నం సత్యనారాయణకు శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు సీనియర్ జర్నలిస్టు మాట్లాడుతూ  గత 20 ఏళ్లుగా లేని నిబంధనను ప్రస్థుత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చింది.

కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా జీవో 252 తీసుకొచ్చి ఆర్సీ ఇంచార్జ్ లుగా ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు మండల అక్రిడేషన్ కార్డులు ఇచ్చి, జిల్లా బస్సు పాసులు ఇవ్వడం జర్నలిస్టులను చిన్న చూపు చూస్తున్నారని విమర్శించారు. తక్షణమే  నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకొని నియోజకవర్గ స్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు జిల్లా అక్రిడేషన్ కార్డులు మంజూరు చేసి బస్సు పాస్, హెల్త్ కార్డ్, జర్నలిస్టులకు ఇల్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.