19 June, 2026 | 9:47 PM

Breaking News

నాగిరెడ్డిపేట్లో తెలంగాణ రక్షణ సమితి జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్   •   విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   చేనేత సంఘ పగ్గాలు చేపట్టిన అడ్వకేట్ నాగుల సత్యనారాయణ   •   ప్రేమ హత్య..? రెండు రోజుల క్రితం మిస్సింగ్   •   ప్రమాద బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా   •   వర్షాలు కురవాలని కోరుతూ... అల్లిపూర్ లో కప్పతల్లి ఆట   •   రాముడి పేరుతో ఓట్లు.. కార్పొరేట్ల కోసం పాలన   •   అధికారం పోయిన పిచ్చిలో మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్   •   పెద్దమ్మ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి   •   మేడిపల్లికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •  

ఆండాలమ్మ వారికి ఊంజల సేవ

19-06-2026 08:28 PM

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వైభవంగా నిత్య పూజలతో ఊంజల్ సేవ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ స్వామి వారి ఆలయంలో శుక్రవారం ఆండాళ్ అమ్మ వారికి ఊంజల్ సేవోత్సవం పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం వేళ అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఊరేగించారు. అమ్మవారికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.అమ్మవారిని ప్రధాన ఆలయం నందు అద్దాల మండపంలో అధిష్టింపజేసి ఊంజల్ సేవోత్సవం నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేక అలంకరణ చేసి వివిధ రకాల పూలతో, తులసి దళాలతో, ఆలయ అర్చకులు పూజలు చేశారు.

ఊంజల్ సేవలో కొలువై ఉన్న ఆండాళ్ అమ్మవారికి అర్చక స్వాములు హారతినిస్తూ కీర్తన చేశారు.వేద మంత్రోచ్ఛారణల మధ్య మంగళవాయిద్యాల సన్నాయి మేళం నడుమ అమ్మవారికి ఊంజల్ సేవ మహోత్సవం కోలాహలంగా నిర్వహించారు.  ప్రత్యేకంగా బంగారంతో తయారు చేసిన 108 పుష్పాలను శ్రీవారి సన్నిధిలో ఉంచి వాటితో అర్చన జరిపారు. తిరువీధి సేవ అమ్మవారి ఊంజల్ సేవను నిర్వహించారు.భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. శ్రీ పర్వత వర్ధిని రామలింగేశ్వర ఆలయంలో స్పటిక  లింగము స్వయంభు లింగాలకు అభిషేకాలను పండితులు నిర్వహించారు. స్వామివారి నిత్య రాబడి  19,69,494/- వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు.