19 June, 2026 | 9:46 PM

Breaking News

నాగిరెడ్డిపేట్లో తెలంగాణ రక్షణ సమితి జెండాను ఆవిష్కరించిన టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్   •   విద్య హక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలి   •   చేనేత సంఘ పగ్గాలు చేపట్టిన అడ్వకేట్ నాగుల సత్యనారాయణ   •   ప్రేమ హత్య..? రెండు రోజుల క్రితం మిస్సింగ్   •   ప్రమాద బీమాతో కుటుంబాలకు ఆర్థిక భరోసా   •   వర్షాలు కురవాలని కోరుతూ... అల్లిపూర్ లో కప్పతల్లి ఆట   •   రాముడి పేరుతో ఓట్లు.. కార్పొరేట్ల కోసం పాలన   •   అధికారం పోయిన పిచ్చిలో మతిభ్రమించి మాట్లాడుతున్న కేటీఆర్   •   పెద్దమ్మ దేవి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి   •   మేడిపల్లికి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జలంధర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ   •  

కవితక్కను సీఎం చేయడమే లక్ష్యం

19-06-2026 08:26 PM

టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు సంపత్ గౌడ్

కామారెడ్డి,(విజయక్రాంతి): టిఆర్ఎస్ అధినేత్రి కవితక్కను ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ కుమార్ గౌడ్ అన్నారు. శుక్రవారం సాయంత్రం కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట టిఆర్ఎస్ జండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మండల కేంద్రాల్లో గ్రామాల్లో వాడవాడల్లో టిఆర్ఎస్ జండా పండుగ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏ ప్రభుత్వం వచ్చిన ప్రజలను పట్టించుకోవడంలేదని అన్నారు. కవితక్కల సీఎంను చేసి పాంచ జన్య పథకాలను అమలు చేసుకుందాం అన్నారు. పాంచ జన్య బతకాలతోనే పేద బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవని, రైతుల సమస్యలు అనేకం ఉన్నాయని అన్నారు. సమస్యలన్నీ ఎక్కడికి అక్కడే ఉన్నాయని ఎవరు పట్టించుకోవడం లేదన్నారు. తెలంగాణ రక్షణ సమితి మాత్రమే తెలంగాణ ప్రజల కష్టాలు కన్నీళ్లను తీరుస్తుందన్నారు.