19 June, 2026 | 7:28 PM

నివాళులర్పించిన సర్పంచ్ వినోద్

19-06-2026 04:25 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం జగన్నాధపురం గ్రామం సొసైటీ ఎస్టీ కాలనీకి చెందిన మడివి వెంకటేష్ (చిన్నోడు) గురువారం అనారోగ్య కారణాలతో మృతి చెందగా శుక్రవారం జగన్నాధపురం సర్పంచ్ కుంజా వినోద్ మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మృతుడి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తో పాటు కాంగ్రెస్ నాయకులు సురభి రాజేష్,రామాచారి,మరీదు నాగు,కురం రామకృష్ణ పాల్గొని నివాళులర్పించారు.